బాలు గారి ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు – ఎస్పీ చరణ్

Published on Aug 15, 2020 8:02 am IST

సంగీత ప్రపంచమే గర్వపడే లెజెండరీ గాయకులు ఎస్పీ బాల సుభ్రమణ్యం గారు ఇప్పుడు కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు కరోనా వచ్చింది అని గత రోజుల కితమే స్వయంగా ఆయనే తెలిపి తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపి ఎవరూ కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు.కానీ నిన్న సాయంత్రానికల్లా ఆయన ఆరోగ్యం విషమించిందని వచ్చిన వార్తలు ఒక్కసారిగా దేశపు సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి లోను చేసింది.

దీనితో ఆయన త్వరగా కోలుకోవాలని లెజెండరీ సంగీత దర్శకులు ఇళయరాజా నుంచి ఏ ఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరు వరకు అంతా కోరుకున్నారు. అయితే ఆ తర్వాత బాలు గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఓ ఫోటో ద్వారా తెలుపడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ఇదిలా ఉండగా ఆయన ఆరోగ్యం మీద ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజా అప్డేట్ తెలిపినట్టు తెలుస్తుంది.

“తన తండ్రి కోలుకోవాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలనీ ఆయన ప్రస్తుతం ఐసీయూ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ నిలకడగా ఉన్నారని ఈలోపు ఎలాంటి వందతులూ ఎవరు నమ్మవద్దని ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తామే అప్డేట్ చేస్తామని” ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం :

More