లయన్ ఆడియో కోసం ప్రత్యేకమైన 3డి సెట్

లయన్ ఆడియో కోసం ప్రత్యేకమైన 3డి సెట్

Published on Apr 3, 2015 3:40 AM IST

lion
ఈ వేసవిలో మనల్ని అలరించడానికి నందమూరి బాలకృష్ణ లయన్ సినిమా ద్వారా సిద్ధమవనున్నారు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 9న విడుదలకానుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సత్యదేవా దర్శకుడు. రాధికా ఆప్టే, త్రిష కధానాయికలు.

ఈ ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించే పనిలో నిర్మాతలు నిమఘ్నమైవున్నారు. సమాచారం ప్రకారం ప్రత్యేకంగా 3డి సెట్ ఒకటి నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా రానున్నారు. ఏప్రిల్ చివరిలో ఈ సినిమా మనముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు