‘సింగ్ గీతం’ ప్రయోగంలో దేవిశ్రీ ప్రసాద్ కి స్పెషల్ అప్లాజ్!

‘సింగ్ గీతం’ ప్రయోగంలో దేవిశ్రీ ప్రసాద్ కి స్పెషల్ అప్లాజ్!

Published on Jun 12, 2026 1:00 PM IST

తనదైన వినూత్న ప్రయత్నాలతో తెలుగు సహా తమిళ్ ఇంకా భారతీయ సినిమా దగ్గర అద్భుతమైన సినిమాలు అందించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి నుంచి పుట్టిన మరో ఆసక్తికర ప్రయోగమే “సింగ్ గీతం”. తన 94 ఏళ్ల వయస్సులో దర్శకత్వం వహించిన ఈ యూనిక్ అటెంప్ట్ పైడ్ ప్రీమియర్స్ తో మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని పూర్తిగా సంగీతంతో ఎలివేట్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు కానీ దానిని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ పనితనంతో రక్తి కట్టించడం చూసిన ఆడియెన్స్ నుంచి సాలిడ్ అప్లాజ్ తీసుకొస్తుంది. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే మొత్తం మాటలు అన్నీ పాటలుగా మలిచి సంగీతంతో తీసుకెళ్లడం అనేది చిన్న కథేమీ కాదు కానీ దానిని దేవిశ్రీ ప్రసాద్ అలవోకగా హ్యాండిల్ చేసిన భావన కలుగుతుంది. దీనితో దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు మాత్రం తన వర్క్ తో మరింత ప్రౌడ్ గా ఫీలవుతున్నారు.

తాజా వార్తలు