షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లనున్నాడో తెలుసా !


ఎన్టీఆర్ బిగ్ బాస్ షోని చేయనుండడం అత్యంత ఆసక్తిగా మారింది. ఈ రియాలిటీ షో షూటింగ్ ముంబైలో జరగనుంది. దీనికి సంబందించిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఎన్టీఆర్ ముంబై లో జరిగే బిగ్ బాస్ షో షూటిగ్ లో పాల్గొననున్నాడు.

ఎన్టీఆర్ ముంబైలో ఉండేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకునేందుకు ఓ గెస్ట్ హౌస్ ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షోలో కొందరు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.