“మనీ హైస్ట్” వెబ్ సిరీస్ లో ఈ పాత్ర చాలా స్పెషల్!

Published on Sep 3, 2021 7:47 pm IST


హాలీవుడ్ చిత్రాలను విపరీతంగా ఆదరించే ఇండియన్స్, వెబ్ సిరీస్ లకు ఇటీవల అలవాటు పడిన సంగతి అందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ లలో మనీ హైస్ట్ ప్రత్యేక స్థానం ను సంపాదించుకుంది అని చెప్పాలి. రాబరీస్ గురించి ఉన్న ఈ యాక్షన్ షో లో ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ఈ సిరిస్ లో మొదటి సీజన్ నుండి ఉన్న అర్తురో పాత్ర చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. మొదటి రాబరీ లో అర్తురో అందరినీ ఇరిటేట్ చేస్తూ ప్రొఫెసర్ టీమ్ కి తెగ ఇబ్బందులు పెడతాడు.

అదే విధంగా రెండవ రాబరీ లో సైతం అనూహ్యం గా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ మనీ హైస్ట్ నాల్గవ సీజన్ లో నైరోబి ను ప్రొఫెసర్ టీమ్ కోల్పోవడం తో వార్ ను ప్రకటించడం జరిగింది. ఈ ఐదవ సీజన్ లో ఏం జరుగుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అర్తురో పాత్ర ఈ సీజన్ లో అయిన చని పోవాలి అంటూ కొందరు కోరుకుంటున్నారు. అంతగా ఈ సీజన్ అందరి పై ప్రభావం చూపింది అని తెలపాలి. మనీ హైస్ట్ ఐదవ సీజన్ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం లో 5 ఎపిసొడ్ లు నేడు విడుదల అవుతుండగా, రెండవ భాగం డిసెంబర్ లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :