‘బాహుబలి’ కోసం బెల్జియంలో స్పెషల్ ఫోలే రికార్డింగ్

‘బాహుబలి’ కోసం బెల్జియంలో స్పెషల్ ఫోలే రికార్డింగ్

Published on Nov 3, 2014 2:03 PM IST

Bahubali
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విజువల్ గా సరికొత్త అనుభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ టెక్నికల్ టీం ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. తాజాగా మరో ఫేమస్ ఇంటర్నేషనల్ టెక్నీషియన్ ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యాడు.

విషయంలోకి వెళితే.. అంతర్జాతీయంగా భాగా ఫేమస్ అయిన ఫోలే ఆర్టిస్ట్ ఫిలిప్ వాన్ లీర్ బాహుబలి కోసం రెండు వారల పాటు పనిచేయనున్నాడు. మన తెలుగు ప్రేక్షకులకు ఫోలే ఆర్టిస్ట్ అంటే చాలా కొత్తగా ఉంటుంది. అందుకే ముందుగా దాని గురించి చెబుతా.. ఫోలే అనేది మనం రోజు లైఫ్ లో వినే సౌన్స్ ని రీ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్. ఈ సౌండ్స్ ని సినిమాల్లో, వీడియోల్లో, మీడియా ప్రమోషన్స్ లో వాడుతుంటారు. దీని ద్వారా అడుగుల శబ్దాన్ని, గ్లాస్ బ్రేక్ చేసినప్పుడు వచ్చే ప్రతి సౌండ్ ని, కత్తి యుద్ధం జరిగేప్పుడు కత్తుల మధ్య వచ్చే చిన్న చిన్న సౌండ్స్ మరియు మన బట్టల ద్వారా వచ్చే సౌండ్స్ ని కూడా దీనిద్వారా కాప్చ్యూర్ చెయ్యచ్చు.

ఈ సౌండ్ ప్రాసెస్ ద్వారా ఫిల్మ్ మేకర్స్ పర్ఫెక్ట్ సౌండ్స్ ని మరియు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే చిన్న చిన్న శబ్దాలను కూడా ఆడియన్స్ ఫెలయ్యేలా చేయవచ్చు. ఇలాంటి అనుభూతినే రాజమౌళి టీం బాహుబలి ద్వారా తెలుగు ప్రేక్షకులకు కల్పించనుంది. ఫోలే ఆర్టిస్ట్ ఫిలిప్ వాన్ లీర్ ఈ రోజు నుంచి నవంబర్ 14వ తేదీ వరకూ అనగా రెండు వారల పాటు బాహుబలి సినిమా కోసం పనిచేయనున్నాడు. ఈ పోలే ఆర్టిస్ట్ ప్రాసెస్ అంతా బెల్జియం లో బాగా ఫేమస్ అయిన డేమ్ బ్లాంచే కాంప్లెక్స్ లో జరగనుంది. ఫోలే ఆర్టిస్ట్ ఫిలిప్ వాన్ లీర్ తో బాటు బాహుబలి సౌండ్ డిజైనర్ అయిన పిఎం సతీష్ కూడా కలిసి పనిచేయనున్నాడు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు