‘మల్లేశం’కు హైప్ క్రియేట్ అవుతోంది

Published on Jun 14, 2019 4:08 pm IST

ఆసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ‘మల్లేశం’ పేరుతో బయోపిక్‌ రూపొందిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాజ్. ఆర్ డైరెక్ట్ చేశారు. ఈ జూన్ 21వ తేదీన చిత్రం విడుదలకానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై కొంత ఆసక్తి క్రియేట్ అయింది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషనలో భాగంగా కొందరు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేశారు.

షో చూసిన సెలబ్రిటీలు, జర్నలిస్ట్ ప్రముఖులు, పలువురు అతిథులు సినిమా బాగుందని, చాలా బాగా తీశారని ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రంలో భావోద్వేగపూరితమైన కంటెంట్ కావాల్సినంత ఉందని కొందరంటే నందిని రెడ్డి లాంటి దర్శకురాలు ఈ చిత్రం తెలంగాణ సంస్కృతికి గౌరవం లాంటిదని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతమంది ఇంతలా చెబుతుండటంతో సినిమాకు హైప్ క్రియేట్ అవుతోంది. మరి 21న మరో మూడు చిత్రాలతో కలిసి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న మల్లేశం ప్రేక్షకుల్ని ఎంతలా మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More