
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున రెండవ తనయుడిగా, అక్కినేని ఫ్యామిలీ మూడవతరం హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్న హీరో అఖిల్ అక్కినేని. ఇప్పటి వరకూ అక్కినేని ఫ్యామిలీ అంటే ఉన్న లవ్ బాయ్ ఇమేజ్ ని చెరిపేయాలనే ఉద్దేశంతో అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’ని పూర్తి కమర్షియల్ హంగులతో ఉండేలా చూసుకున్నాడు. అలాగే కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో అఖిల్ ని పర్ఫెక్ట్ మాస్ ఇమేజ్ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దాంతో ఈ చిత్ర టీం గ్రాండ్ గా అఖిల్ ప్లాటినం డిస్క్ వేడుకని నిర్వహించడానికి సిద్దమైంది. అందుకోసం అక్టోబర్ 17వ తేదీనిఫైనలైజ్ చేసారు, అలాగే ఈ వేడుకని ఆంధ్ర ప్రదేశ్ లో చెయ్యాలని నిర్ణయించారు. కానీ ఈ కార్యక్రమం కోసం రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అవే వైజాగ్ మరియు విజయవాడ. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో ఒక ప్లేస్ ని ఫిక్స్ చేసి గ్రాండ్ గా అఖిల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నారు. మరోవైపు రేపటికల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసి 16వ తేదీన సినిమాని సెన్సార్ కి పంపడానికి రంగం సిద్దం చేస్తున్నారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి నితిన్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

