
పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన తాజా సినిమా ‘టెంపర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. 100% కన్నింగ్ & కరప్టడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ సాగించిన దయగాడి దండయాత్ర ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
‘టెంపర్’ ఘన విజయం సాదించాలని కోరుతూ.. షాద్ నగర్ నుండి శ్రీశైలం మలన్న స్వామి సన్నిధానం వరకు నిర్మాత బండ్ల గణేష్ సోదరుడు, శివబాబు బండ్ల పాదయాత్ర చేస్తున్నారు. నేడు ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదల సమయంలో కూడా శివబాబు ఇదే తరహాలో పాదయాత్ర చేసి శ్రీశైలం మలన్న స్వామిని దర్శించుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం సాదించింది. ఇప్పుడు కూడా స్వామి వారి ఆశీసులతో ‘టెంపర్’ ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని బండ్ల గణేష్ వ్యక్తం చేశారు.