గ్రాండ్ గా చైతు – సమంతల రిసెప్షన్ !
Published on Oct 17, 2017 5:39 pm IST

తాజాగా నాగ చైతన్య, సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి వేడుక హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల్లో రెండు సార్లు జరిగింది. తొలుత హిందూ సాంప్రదాయంలో వివాహ వేడుక జరిగిన తర్వాత, మర్నాడు క్రిష్టియన్ స్టైల్ లో పెళ్లి జరిపిన్చచారు పెద్దలు. గోవాలో జరిగిన పెళ్లి వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు.

సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు, త్వరలో ఆఫిషియల్ గా తెలుపనున్నారు నాగార్జున. నిన్న చెన్నై లో సమంతా, నాగ చైతన్య రిసెప్షన్ నిర్వహించారు చైతు తల్లి తరుపున దగ్గుబాటి సురేష్. ఈ వేడుకకు దగ్గుబాటి, అక్కినేని కుటుంబ సన్నిహితులు పాల్గొనడం జరిగింది

 
Like us on Facebook