‘వాల్తేరు వీరయ్య’ లో మరో స్పెషల్ రోల్ ?

‘వాల్తేరు వీరయ్య’ లో మరో స్పెషల్ రోల్ ?

Published on Nov 7, 2022 11:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ ఏమిటంటే, ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ యస్ఐ పాత్ర ఎంట్రీ ఇస్తోందని.. ఈ పాత్ర నిడివి తక్కువ అయినా సినిమాలో కీలకం అని, విలన్ చేతిలో హత్య కాబడే ఎమోషనల్ పాత్ర ఇది అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పాత్రలో యంగ్ హీరో కార్తికేయ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. ఇక రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు