ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో ఆ పాత్ర ఎవరు చేస్తారు ?
Published on Feb 20, 2018 8:29 pm IST

అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అగ్నాతవాసి సినిమాలో కుస్భు ప్రధాన పాత్రల్లో కనిపించారు. అదే విధంగా ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాలో అదే తరహ ముఖ్య పాత్ర ఒకటి ఉందని సమాచారం. ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. సినిమాలో ఈ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండడంతో పలు ఓల్డ్ హీరోయిన్స్ ను సంప్రదించారంట చిత్ర యూనిట్.

ముఖ్యంగా ఈ పాత్ర కోసం లయ, సిమ్రాన్, మీనా ఆప్షన్స్ ఉన్నాయని సమాచారం. త్వరలో ఒకరి పేరును ఖరారు చెయ్యబోతోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఈ సినిమాకు బాడి తగ్గింది స్లిమ్ అయ్యాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని సంస్థ బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 
Like us on Facebook