‘రంగస్థలం’ స్పెషల్ షోలకు అనుమతులు !

ఈ వేసవికీ విడుదలకానున్న భారీ చిత్రాల్లో రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’ ఒకటి. మెగా అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాకున్న క్రేజ్ మూలాన, భారీ బడ్జెట్ చిత్రం కావడం వలన నిర్మాతలు ఆంద్రప్రదేశ్ లో స్పెషల్ షోలు వెయ్యడానికి అనుమతులివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం కూడ నిర్మాతల వినతి మేరకు పామిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపిలోని అన్ని ఏరియాల్లో ఉదయం 5 గంటల నుండి 10 గంటలలోపు ఒక స్పెషల్ షో వేయనున్నారు. ఈ స్పెషల్ షోలు 30 వ తేదీ నుండి వారం రోజులు పాటు నడవనున్నాయి. చరణ్ సరసన సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబులు పలు కీలక పాత్రల్లో నటించారు.