
బాలీవుడ్ తరచూ మన సౌత్ సినిమాలపై దృష్టిపెట్టి ఇక్కడ కధలను అక్కడ క్యాష్ చేసుకుంటుంది అన్న విషయం తెలిసినదే. షారుఖ్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి తారలు వాళ్ళ సినిమాలో కధల ఎంపిక ద్వారానో, రీమేక్ ల ద్వారానో సౌత్ మూవీ ఫ్లేవర్ ను మనకు అందిస్తూనే వున్నారు.
సంప్రదాయిక తమిళ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బాద్ షా సౌత్ లో వున్న అగ్ర నటులతో కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ లో నటించే ప్లాన్ వేస్తున్నాడని సమాచారం.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలను బట్టి ఈ సినిమాకోసం షారుఖ్ కొంతమంది సినిమా ప్రముఖులను కలుస్తున్నాడట. ఇంకా ఎటువంటి విషయం ఖరారు కాలేదు. బాలీవుడ్, టాలీవుడ్ కి మధ్య సంబంధాలు మరింత దగ్గరవడానికి ఇదొక సువర్ణావకాశం అని కొందరి అభిప్రాయం.
గతంలో రజినీకాంట్, అమితాబ్ లు కూడా ఇలానే కలిసి నటిస్తారు అని వార్తలొచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ సినిమా గనుక మొదలైతే షారుఖ్ ఎవరితో నటిస్తే బాగుంటుంది అన్నది కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తెలుపండి.