‘మందాడి’ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే..?

‘మందాడి’ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే..?

Published on Jun 9, 2026 11:22 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ముఖ్య పాత్రలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘మందాడి’. ఈ చిత్రానికి మథిమారన్ దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ కాస్ట్ అండ్ క్రూతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే అందరిలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్‌ను రేపు(జూన్ 10) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. “ఫ్రమ్ ది షోర్స్ ఆఫ్ మందాడి” అంటూ వచ్చిన ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, బాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ విజువల్ వండర్ రేపటి అనౌన్స్‌మెంట్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తాజా వార్తలు