అన్ని ఎలిమెంట్స్ తో ఎంటర్టైనింగ్ గా ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ ట్రైలర్.!

Published on Jul 28, 2021 10:03 am IST

“రాజా వారు రాణి గారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఆ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన సినిమానే “ఎస్ ఆర్ కల్యాణమండపం”. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా మంచి హైప్ ను ఇప్పటికే తెచ్చుకుంది. ఆ మధ్య వచ్చిన టీజర్ మరియు పాటలకు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా మేకర్స్ ట్రైలర్ కట్ ను రిలీజ్ చేశారు.

మరి ఈ ట్రైలర్ ను చూసినట్లయితే లాక్ డౌన్ అనంతరం థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకి మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉందనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ కట్ లో దర్శకుడు చూపిన ఎమోషన్స్ మరియు మాస్ ఎలిమెంట్స్ ఆన్ స్క్రీన్ పై బాగా ఎలివేట్ అవుతాయనిపిస్తుంది. అలాగే కిరణ్ కూడా ఈ సినిమాకి మరింత ప్రావీణ్యం పొందినట్టు అనిపిస్తున్నాడు.

హీరోయిన్ ప్రియాంకతో మంచి కామెడీ నాన్న సాయి కుమార్ తో ఎమోషన్స్, అలాగే మాస్ సన్నివేశాల్లో కూడా బాగా కనిపిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో తండ్రి కొడుకుల బ్లాక్ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉండగా చైతన్ భరద్వాజ్ సంగీతం పాటల పరంగా బాగున్నా ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది.

ఓవరాల్ గా మాత్రం ముందు చెప్పినట్టుగానే చాలా కాలం తర్వాత థియేటర్స్ కి వచ్చే ఆడియెన్స్ కి ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలానే కనిపిస్తుంది. మరి ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఆగష్టు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :