థియేటర్ల లోకి ఆగస్ట్ 6 న “ఎస్ఆర్ కళ్యాణమండపం”

Published on Jul 12, 2021 9:36 pm IST

శ్రీధర్ గాదె దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. ఈ చిత్రం లో కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవాల్కర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ మరియు రాజులు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల తేదీ కి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేయడం జరిగింది. ఆగస్ట్ 6 వ తేదీన ఎస్ ఆర్ కళ్యాణ మండపం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చైతన్ భరద్వాజ ఈ చిత్రానికి సంగీతం అందించగా, విశ్వస్ డానియల్ చిత్రానికి కొరియోగ్రఫీ చేసారు.

సంబంధిత సమాచారం :