“ఎస్ ఆర్ కళ్యాణమండపం” వరల్డ్ వైడ్ రైట్స్ వాళ్ళకే.!

Published on Jun 14, 2021 3:02 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని చిత్రాల్లో “రాజావారు రాణిగారు” ఫేమ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా అలాగే టాక్సీవాలా నటి ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “ఎస్ ఆర్ కళ్యాణమండపం” కూడా ఒకటి.

ఇప్పటికే ఈ సినిమా ఆడియోకి భారీ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మంచి బజ్ ఎప్పుడో నెలకొంది. అలాగే మరోపక్క ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరియు ఈ తరుణంలో ఈ చిత్రం తాలూకా వరల్డ్ వైడ్ రైట్స్ శంకర్ పిక్చర్స్ వారు దక్కించుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే వారు మరో విషయాన్ని కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని ఓటిటి రిలీజ్ లేదని తెలిపారు. ఇక ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు చైతన్ భరద్వాజ్ సంగీతం అందివ్వగా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :