శైలజారెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధులు గా ‘దేవదాస్’లు !

Published on Sep 5, 2018 4:01 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న’ శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహర్తం ఖరారు అయింది. ఈనెల 9న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ జరుగనుంది. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా కింగ్ నాగార్జున తో పాటు సహజ నటుడు నాని హాజరు కానున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ‘దేవదాస్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

మారుతీ తెరకెక్కిస్తున్న శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. సీనియర్ నటి రమ్య కృష్ణ శైలజారెడ్డి పాత్రలో నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది .

సంబంధిత సమాచారం :