శ్రావణ మహాలక్ష్మికి పురాణపండ ‘ శ్రీమాలిక ‘ను వేసిన రోజా

శ్రావణ మహాలక్ష్మికి పురాణపండ ‘ శ్రీమాలిక ‘ను వేసిన రోజా

Published on Aug 26, 2021 5:30 PM IST
Nagari MLA Roja, Puranapanda Srinivas
Nagari MLA Roja, Puranapanda Srinivas

నగరి : ఆగస్టు : 26

నిష్కామ భావనతో కర్తవ్య పాలన చేసే పవిత్రమార్గాలకు ఎన్నడూ అవరోధాలు రావనడానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మంత్ర శబ్దాల అపరిమేయ
వైభవమే మన కనులముందు కనిపిస్తున్న సత్యం.

ప్రార్ధన కంటే గొప్ప శక్తి లేదని నిరూపిస్తున్న పురాణపండ శ్రీనివాష్ అఖండ గ్రంధాలకు తెలుగునాట ఆదరణ అనూహ్యమ్. అపూర్వమ్ భవ్యమైన దివ్యశక్తులను అక్షర అక్షయ బాండాలుగా అద్భుతంగా అందించడంలో అందెవేసిన కలంగా విశేష ఖ్యాతి గడించిన పురాణపండ శ్రీనివాస్ కళ్యాణకారకంగా
అందించిన మరో అపురూప మహాగ్రంధమే .. ‘ శ్రీమాలిక ‘ . గత సంవత్సరం పరమ రమణీయ శోభతో … విస్తృత ఆధ్యాత్మిక విలువలతో పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనంగా అందించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహా గ్రంధానికి సమర్పకురాలిగా వ్యహరించిన ప్రముఖ సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా ఇప్పుడు శ్రావణ మాసపు మంగళమయ సాధనగా ఒక తేజస్సుగా ఆవిష్కరించిన ‘ శ్రీమాలిక ‘ గ్రంధం’ నగరి భక్తజనుల , వైఎస్సాఆర్సిపి పాలక శ్రేణుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

నగరిలో వేలకొలది జనుల్ని పరవశింప చేసిన ‘ శ్రీమాలిక ‘ గ్రంధానికి కూడా పురాణపండ శ్రీనివాసే రచయిత కావడం గమనార్హం. రోజా ప్రత్యక్షంగా జరుపుకున్న శ్రావణ మంగళగౌరీ నోముకు విచ్చేసిన సుమారు వందమంది ముత్తయిదువులకు చీర, జాకెట్ , పసుపు కుంకుమలతోపాటు శ్రీమాలిక గ్రంధాన్నీబహూకరించడం కూడా ఒక విశేషంగానే పేర్కొనాలి. సహజంగా దైవభక్తురాలైన రోజా తాను పాల్గొనే, తానో జరిపించే అనేక భక్తి కార్యాలలో తనమిత్రులైన ప్రముఖ సాహితీవేత్త పురాణపండ శ్రీనివాస్ మహాగ్రంథాలనే పంచిపెడతారు. అలానే .. ఈ శ్రావణ విశిష్ట సందర్భంలో కూడా ఉదాత్తమైన ‘ శ్రీమాలిక ‘ గ్రంధాలను అమ్మవారి పూజలో పెట్టి మరీ పంచడం రోజా శ్రద్ధకు నిదర్శనమని చెప్పాలి.

పురాణపండ శ్రీనివాస్ అఖండానంద ధారలుగా నిరంతరం పొంగించే ఈ మంత్రచైతన్యం ఒక తాదాత్మ్యతతో కూడి ఉండటం వల్లనే ఇంతమందిని ఈ బుక్స్ఆకట్టుకుంటున్నాయని రోజా చెప్పడం గమనార్హం. సాధారణ పాఠకుడికి, ఉపాసకునికీ మేలు చేకూర్చే పురాణపండ రమణీయ, కమనీయ పవిత్ర ప్రతిభా గ్రంధాల రచనా, ప్రచురణలే ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే … మరొక ప్రక్క నిస్వార్ధంగా చేస్తున్న ఉచిత వితరణ మేధో సమాజాన్ని ఇంకా ఆశ్చర్య పరుస్తోంది.

ఏదేమైనా రోజా ఉదారకీర్తికి ఇలాంటి మంచిపనులు ఇంకా ప్రత్యక్ష వైభవాన్ని ఆవిష్కరిస్తాయని వైఎస్సార్సిపి వర్గాలు ఆనందాన్ని ఆవిష్కరిస్తున్నాయి.శ్రావణ మహాలక్ష్మికి రెండువందల యాభై పేజీల శ్రీమాలికను సమర్పించిన రోజాను నగరి వైదిక వర్గాలు , భక్తి వర్గాలు, మహిళా వర్గాలు ప్రశంసలతో ముంచెత్తాయి .

ఒక ప్రజ్ఞాన ఘన స్వరూపంగా, అత్యద్భుత రీతిలో పురాణపండ శ్రీనివాస్ అందించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహా గ్రంధం ఇప్పటికే సంవత్సరంన్నర కాలంలో ఇరవై ఐదు ముద్రణలకు నోచుకుందంటే శ్రీనివాస్ మహాప్రతిభ స్థాయిని, భగవదనుగ్రహాన్ని అందరం సామూహికంగా అంగీకరించాల్సిందే. శ్రీపూర్ణిమ అలౌకిక సౌందర్యం వెనుక శ్రీనివాస్ కృషి అలాంటిది మరి.

రోజా సమర్పణాభావం కూడా అంతే సంస్కారంతో కూడింది కాబట్టే ఈ బుక్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు