కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన శ్రీవిష్ణు

Published on Dec 6, 2019 2:34 pm IST

ఈ ఏడాది ‘బ్రోచేవారెవరురా’తో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఆ తర్వాత చేసిన ‘తిప్పరా మీసం’ పెద్దగా విజయం అందించకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. అందుకే మళ్లీ ఎంటర్టైన్మెంట్ జానర్లోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకుని పలు కథలు విని చివరికి ఒక సినిమాను ఓకే చేశారు.

ఈ చిత్రం ఈరోజే లాంఛ్ అయింది. ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన హసిత్ గోలీ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై
టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ కామెడీ డ్రామాకు వివేక్ సాగర్ సంగీతం అందించనున్నాడు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

X
More