స్పీడ్ తగ్గని శ్రీవిష్ణు.. చేతిలో ఏకంగా నాలుగు..!

Sree Vishnu

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వారం వ్యవధిలోనే ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’ సినిమాలను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆయన తన జోరును మాత్రం తగ్గించడం లేదు.

ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సన్నీ సంజయ్ మూవీ సగానికి పైగా పూర్తి కాగా, ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజుతో చేస్తున్న సినిమా కూడా శరవేగంగా సాగుతోంది. ఇవి రెండూ 2026లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

వీటితో పాటు దర్శకులు భాను భోగవరపు, పవన్ బసంశెట్టిలతో కూడా శ్రీవిష్ణు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అయితే వేగంతో పాటు క్వాలిటీపై కూడా దృష్టి పెట్టాలని, ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ విషయంలో వస్తున్న విమర్శలను గమనించి వినోదాత్మక చిత్రాలతో సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Exit mobile version