ముగ్గురు హీరోల మల్టీస్టారర్ నుంచి మరో ఇంట్రస్టింగ్ పోస్టర్ !

Published on Oct 21, 2018 10:35 am IST


నూతన దర్శకుడు ఇంద్రసేన దర్శకత్వంలో.. యువ హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా చిత్రబృందం సినిమాలోని శ్రీవిష్ణు గెటప్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో.. కండలు తిరిగిన శ్రీవిష్ణు దేహం మీద.. శివుడి రూపంతో పాటు పలు హిందు దేవుళ్ళ చిహ్నాలు కూడా పచ్చబొట్లుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పోస్టర్ సినిమా పై ఆసక్తిని పెంచేలా ఉంది.

కాగా సినిమా కూడా వైవిధ్యమైన కథ కథనాలతో తెరకెక్కుతుందని.. ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందని.. ఓవరాల్ గా ఈ ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వనుంది. అయితే ఈ చిత్రం యుఎస్ లో విడుదల తేదీ కంటే రెండు రోజుల ముందే అక్టోబరు 23న విడుదల అవ్వబోతుంది. ఫ్లైహై సినిమాస్ ఈ చిత్రాన్ని యుఎస్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :