‘సింగిల్’ ట్రైలర్ టాక్.. శ్రీవిష్ణు మార్క్ ఎంటర్‌టైనర్!

‘సింగిల్’ ట్రైలర్ టాక్.. శ్రీవిష్ణు మార్క్ ఎంటర్‌టైనర్!

Published on Apr 28, 2025 4:45 PM IST

టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్‌గా హీరో శ్రీవిష్ణు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘సింగిల్’ ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ కట్ చేశారు. శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్‌లో రివీల్ చేశారు. శ్రీవిష్ణు తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీవిష్ణుతో కలిసి వెన్నెల కిషోర్ చేయబోయే కామెడీ ప్రేక్షకులకు ఫన్ రైడ్ అందించడం ఖాయమని స్పష్టం అవుతోంది.

ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, కల్యా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు