ప్రకాష్ రాజ్ కి కౌంటర్ అటాక్ ఇచ్చిన శ్రీను వైట్ల

Srinu-Vaitla--prakash-raj
ప్రస్తుతం టాలీవుడ్ లో డైరెక్టర్ శ్రీను వైట్ల – విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది. ‘ఆగడు’ సినిమా టైములో మొదలైన ఈ గొడవ ఇప్పుడు మరింత ఎక్కువగా రాజుకుంది. నిన్ననే ప్రకాష్ రాజ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి శ్రీను వైట్లకి సంస్కారం లేదని, అహంకారం తగ్గించుకోవాలని అన్నాడు.

ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ కి కౌంటర్ అటాక్ గా శ్రీను వైట్ల ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మాట్లాడుతూ ‘ముందుగా ప్రకాష్ రాజ్ ని ఆగడు నుంచి తీసెయ్యడానికి కారణం నా అహంకారం కాదు, నా ఆత్మాభిమానం. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి నాకు డెడికేట్ చేస్తూ ఓ పద్యం విసిరారు. నా మీద రాసింది కావున దాని మీద పూర్తి హక్కు నాకుందని అందుకే సినిమాలో పెట్టాను. పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్ గురించి నేనెందుకు అంటాను. పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం. ఇప్పటికే ఎన్.టి.ఆర్ తో సినిమా కూడా చేసాను. ఇకపోతే డైరెక్టర్ గా సినిమా ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అనే విషయాలను ప్రకాష్ రాజ్ నుంచి నేర్చుకునే స్థితిలో నేను లేను. ఎందుకంటే ఆయన తీసిన ఉలవచారు బిర్యాని రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలుసు. అహంకారం తగ్గించుకోమని ప్రకాష్ రాజ్ నాకు సలహా ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన మీద ఉన్నన్ని కంప్లైంట్స్ మరియు బ్యాన్స్ ఇంకెవరి మీద లేవు. దీన్నిబట్టి ఎవరు అహంకారం ఉన్నవారో తెలుస్తోందని’ అన్నాడు.

మరి ఈ శ్రీనువైట్ల కౌంటర్ అటాక్ కి బదులుగా ప్రకాష్ రాజ్ ఎలాంటి కౌంటర్ అటాక్ తో వస్తాడో చూడాలి..

Exit mobile version