పవన్, మహేష్ లతో మల్టీ స్టారర్ అంటున్న స్టార్ డైరెక్టర్

పవన్, మహేష్ లతో మల్టీ స్టారర్ అంటున్న స్టార్ డైరెక్టర్

Published on Oct 15, 2015 4:22 PM IST

Srinu-Vaitla

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్తోందా.? ఈ క్రేజీ కాంబినేషన్ వింటుంటేనే బాడీలో వైబ్రేషన్స్ తెప్పిస్తోంది కదా.. ప్రస్తుతానికి ఇది నిజం కాకపోయినా ఇదే కాంబినేషన్ లో ఓ సినిమా చెయ్యడమే తన డ్రీంగా పెట్టుకున్నాడు ఓ క్రేజీ డైరెక్టర్. అతనే మన శ్రీను వైట్ల. యాక్షన్, కామెడీ, కుటుంబ విలువలను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చెప్పే డైరెక్టర్ గా శ్రీను వైట్లకి మంచి పేరుంది. శ్రీను వైట్ల రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన శ్రీను వైట్లని మీ డ్రీం ప్రాజెక్ట్ ఏంటి అని ‘ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబులను కలిపి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడమే నా డ్రీం.. కచ్చితంగా దాన్ని చేయడానికి ట్రై చేస్తానని’ శ్రీను వైట్ల తెలిపాడు. ఇంతటి క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయడం అనేది మాటలు కాదు, కానీ మన శ్రీను వైట్ల భవిష్యత్ లో ఇదే కాంబినేషన్ ని సెట్ చేసి తన డ్రీం ని నెరవేర్చుకుంటాడేమో చూడాలి.. కానీ ఈ వార్త మాత్రం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపింది.

తాజా వార్తలు