అనూహ్య స్పందనతో దూసుకుపోతున్న శ్రీనివాస్ ‘ శ్రీపూర్ణిమ’

అనూహ్య స్పందనతో దూసుకుపోతున్న శ్రీనివాస్ ‘ శ్రీపూర్ణిమ’

Published on Nov 21, 2019 12:30 PM IST
Sri Poornima book written by Puranapanda Srinivas
Sri Poornima book written by Puranapanda Srinivas

హైదరాబాద్ : నవంబర్: 21

మనం భగవంతునికి ప్రార్ధన ద్వారా చెప్పుకునే భక్తి బలపడేకొద్దీ మనలోంచి కోపం, కామం,అహంకారం, అసూయ, పగ, దురాశ, అతిశయం మాయమైపోతాయంటాడు స్వామివివేకానంద. అది నిజం కాబట్టే ఇన్ని యుగాలుగా మనిషి జీవితానికి ప్రార్ధన పరమార్ధమైంది. మన జీవనపయనానికి పవిత్రమైన మార్గమే ప్రార్ధన. ప్రార్ధన మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించే అతీతమైన మహాశక్తి. ఆ మహా మహాశక్తినే ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూపంగా , పరమ పవిత్రంగా తన విలక్షణ శైలిలో పదికాలాలపాటు ఉండేలా ‘ శ్రీపూర్ణిమ ‘ పేరిట తెలుగు పఠితలకు అందించి వేలకొలది ప్రశంసలు అందుకోవడం మన కళ్ళ ఎదుట కనిపిస్తోంది.

గత రెండు దశాబ్దాలలో ఇంతగా ప్రాచుర్యం పొందిన అత్యద్భుత ఆధ్యాత్మిక రచనా సంకలనం లేదనే చెప్పాలి. పురాణపండ శ్రీనివాస్ ఏది ఎంచుకున్నా అది విభిన్నంగా, చాలా క్వాలిటీగా , అందమైన శైలితో, చాలా నాణ్యతకలిగిన ముద్రణతో మనకు లభించడం గత పదేళ్లుగా చూస్తూనే వున్నాం. ఆకోవలోనిదే శ్రీపూర్ణిమ గ్రంధం. తన జీవన యాత్రకు ఎదురైన సవాళ్ళను అధిగమిస్తూ లక్షల భక్త పాఠకుల మనసుల్ని కొల్లగొట్టేస్తున్నారు శ్రీనివాస్ . పురాణపండ శ్రీనివాస్ చాలా మంచివక్త. గత పదేళ్లుగా ఆయన ఎటువంటి మీటింగ్ ని ఒప్పుకోకుండా ఎన్నో రకాల పారమార్ధిక గ్రంధాలను మన తెలుగు గడపాలకు పవిత్రంగా తాకిస్తున్నారు. రేయింబవళ్ళ శ్రీనివాస్ శ్రమే ఆయన పరిశ్రమ . ఈరోజు దేశదేశాలలో పురాణపండ శ్రీనివాస్ మీద తాలూకు ఆధ్యాత్మిక గ్రంధాలు వెల్లివిస్తున్నాయంటే కారణం ఆయన నిస్వార్ధ సేవ. హిందువులైన ప్రతీ తెలుగు వారింట ఉండాల్సిన బుక్ ‘ శ్రీపూర్ణిమ’ . ఈ పుస్తకం తెరిస్తే మొత్తంగా చూస్తామే గానీ మధ్యలో అస్సలు వదిలేయలేము. ఎన్నెన్ని అంశాలు,ఎన్నెన్ని వ్యాఖ్యానాలు, ఎన్నెన్ని కధలు, ఎన్నెన్ని స్తోత్రాలు , ఎన్నెన్ని అరుదైన సుందర చిత్రాలు . మొత్తంగా చెప్పాలంటే ఒక శక్తిమంతమైన పవిత్ర అనుభూతిని కలిగించే పుస్తకాన్ని పురాణపండ శ్రీనివాస్ తెలుగు భక్తులకి అందించి చరిత్రలో నిలిచిపోయారు.

నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, అశ్వనీదత్, దిల్ రాజు, రోజా … వంటి సినీ ప్రముఖులే కాకుండా తెలంగాణా, ఆంధ్రా ప్రభుత్వాలకు చెందిన మంత్రులు శాసన సభ్యులు సైతం ఇప్పటికి పదహారు ప్రచురణలకి పైగా ముద్రించి ఉచితంగా అందించడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ బుక్ లుక్ అలాంటిది. ప్రతీ పేజీలో పురాణపండ శ్రీనివాస్ సృజనాత్మక ప్రతిభ రెపరెపలాడుతోంది. ఇందులోని వేదమంత్రాల, స్తోత్రాల ఆధిపత్యం మనకి ఎంతో మేలు చేకూర్చే భక్తి సంతోష సౌందర్యాలు. ఏ ఉదాత్త ముహూర్తాన ఈ ‘ శ్రీపూర్ణిమ ‘ అఖండ గ్రంధానికి సంకల్పించారోగానీ మఠాలలో, పీఠాలలో, ఆలయాలలో, వేదపాఠశాలల్లో, పారాయణా మండళ్లలో మాత్రమే దర్శనమివ్వకుండాఅన్ని శుభకార్యాలలో సైతం కొందరు సౌజన్య మూర్తులు శ్రీపూర్ణిమను మంగళ కలశంగా పంచిపెట్టడం శుభావహం.

మొట్టమొదటి భారతీయ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంపై పిహెచ్ డి చేసి డాక్టరేట్ పొందిన సాహితీప్రతిభాశాలి శ్రీమతి డాక్టర్ సి.హెచ్.వి.ఎస్. రమణీకుమారి తన కుమారుడైన సాఫ్టువేర్ ఉన్నత ఉద్యోగి నేదునూరి శ్రీరామ్ గృహప్రవేశ ఉత్సవంలో విచ్చేసిన మిత్ర బృందాలకు చక్కని ‘ నేనున్నాను ‘ ఆంజనేయ మహాగ్రంధంతో పాటు అమృతధారగా ఈ కానుకని అందించిన్నప్పుడు వారుపొందిన తన్మయత్వం మాటల కొలతలకు అందేదికాదు. పురాణపండ శ్రీనివాస్ దివ్య గ్రంధాలని స్వీకరిస్తినా వారు ‘ ఇంతకంటే మాకేం కావాలని’ ఆనందంగా సాగడం దైవబలమేనని చెప్పాల్సిందే. ఈ గ్రంధాలను నేదునూరి గోపాలకృష్ణ, శ్రీమతి రమణీ కుమారి దంపతులు తమ చిరంజీవులైన లలిత, కిరణ్మయి శ్రీరాంతో కలిసి పంచడం ఒక మంగళకరం భాంధవ్య శుభపరిణామంగా బంధుమిత్రులు అభినందించారు కూడా. చెన్నాప్రగడ శ్రీనివాస్, శ్రీమతి హైమావతి దంపతుల పర్యవేక్షణలో ఈ మహా గ్రంథ వితరణోద్యమం పరం సంతోషంగా సాగింది.

ఇంకొక ముఖ్యాంశమేమంటే హైదరాబాద్ మణికొండలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన బ్రాహ్మణ వనభోజన పవిత్ర కార్యక్రమంలో కూడా జంట నగరాల ప్రముఖులైన కె. ముక్తేశ్వరరావు సారధ్యంలో ఎంతోమంది ప్రముఖులకు ఈ ‘ శ్రీ పూర్ణిమ’ గ్రంధాన్ని కార్తీక మాసపు కానుకగా అందించి భగవంతుని అనుగ్రహాన్ని పొందారని చెప్పాలి. అన్నవరం మహాక్షేత్రంలో సైతం సాహితీ ప్రియులు, శివభక్తులు అల్లమరాజు కృష్ణశర్మ ఆధ్వర్యంలో ఆలయ సత్యదేవవ్రత విభాగ పురోహితులు వేదుల చక్రవర్తి తదితర బృందాలకు పవిత్ర హృదయంతో బహూకరించడం విశేషం

ఈ పుస్తకం చూసాక, తెరిచాక మన మనస్సంతా ఒక తేజస్సుతో నిండి పోతుందనేది పరమ సత్యం. పుస్తకాలకు డిమాండ్ తగ్గుతున్న ఈ రోజుల్లో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతుల ప్రోత్సాహంగా ఈ పుస్తకాన్ని ఇందరు అందుకోవడం ఖచ్చితంగా శివానుగ్రహమే. ఇప్పటికే ఈ పుస్తకానికి విపరీతమైన డిమాండ్ వఛ్చి పురాణపండ శ్రీనివాస్ పేరు చక్కగా మారుమ్రోగుతోందని సాహితీ వేత్తలు, పండితులు మాత్రమే కాదు భక్తులైన పారిశ్రామికవేత్తలు కూడా ఎలుగెత్తి చెప్పడం విశేషం. చెబుతున్నారు. అయితే పురాణపండ శ్రీనివాస్ శ్రీపూర్ణిమ గ్రంధాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచురణల సంస్థ మోహన్ పబ్లికేషన్స్ వారు రైట్స్ కొనుక్కున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఎవరింట శ్రీపూర్ణిమ ఉంటే ఆ ఇంట గోవులు కొలువుతీరి సిరులు వర్షిస్తాయని తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యుల మాట రథనాలమూట . ఇది నిజం. ఇదే నిజం. పురాణపండ శ్రీనివాస్ శ్రీపూర్ణిమ అలాంటిది మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు