శ్రీరెడ్డి కి సూపర్ పవర్స్ ఉంటే ఆనటుడితో చిన్న పాత్రలోనైనా ఓకేనంటా.

Published on May 18, 2019 7:18 pm IST

ఇండస్ట్రీ ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి ఎదో విధంగా వార్తలలో ఉంటూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు శ్రీరెడ్డి. “నాకే కనుక సూపర్ పవర్స్ ఉంటే ఒకే ఒక్కసారి నట సార్వబౌమ నట సింహ అయిన టాలీవుడ్ NO 1 హీరో ఎన్టీఆర్ గారి తోటి ఒక చిన్న చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు, జై ఎన్టీఆర్” అని ట్వీట్ చేశారు.
అలా తన ట్వీట్లో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానం తో పాటు, తన కోరిక కూడా ఎన్టీఆర్ కి తెలిసేలా చేసింది శ్రీ రెడ్డి. మరి తన అభిమాని ఆశను ఎంతవరకు ఎన్టీఆర్ తీరుస్తాడో చూడాలి మరి. సంచలనాల శ్రీరెడ్డి కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ “బిగ్ బాస్ 3″లో పాల్గొనే ఛాన్స్ కొట్టేశారని సమాచారం. అదేకనుక నిజమైతే శ్రీరెడ్డి దశతిరిగినట్లే.

సంబంధిత సమాచారం :

More