శ్రీ విష్ణు నూతన చిత్రం ప్రారంభం !

శ్రీ విష్ణు నూతన చిత్రం ప్రారంభం !

Published on Jun 22, 2018 4:30 PM IST

‘నీది నాదీ ఒకే కథ’ ఫేమ్ శ్రీ విష్ణు నటించే కొత్త చిత్రం పూజ కార్యక్రమాలతో హైద్రాబాద్లో ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది . ‘తిప్పరా మీసం’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కు సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ కు హీరో నారా రోహిత్ క్లాప్ కొట్టారు. నారా రోహిత్ హీరో గా ‘అసుర’ చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణ విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ చిత్రం టైటిల్ తోనే మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఇక వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు నటిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి. ఇంతకు ముందు అయన నటించిన నీది నాదీ ఒకే కథ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు