థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అవుతున్న “రాజ రాజ చోర”.!

Published on Aug 11, 2021 2:35 pm IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నటుడు శ్రీ విష్ణు కూడా ఒకడు. తాను నటించి లాస్ట్ చిత్రం “గాలి సంపత్” లాస్ట్ లాక్ డౌన్ కి ముందు రిలీజ్ అయ్యి మంచి మార్కులే సంపాదించుకుంది. మరి ఇప్పుడు ఈ యువ హీరో మరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. అదే “రాజ రాజ చోర”.

హషిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్ పోస్టర్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ ఆ మధ్య వచ్చింది. అయితే పరిస్థితుల రీత్యా ఈ చిత్రం కూడా ఓటిటికే వెళ్ళింది అని టాక్ రాగా కానీ ఫైనల్ గా మాత్రం మేకర్స్ ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కే రెడీ చేసినట్టు తెలుస్తుంది.

ఈ వచ్చే ఆగష్టు 19 ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఇప్పుడు ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. మంచి బజ్ లోనే ఉన్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ ని నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం :