వెనకనుంచి వచ్చి ఊరిని దత్తత తీసుకున్న పృథ్వీ..!

Published on Jul 6, 2021 2:19 am IST

శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు గుర్తుందా.. అదే మాదిరిగా కరువు కాటకాల్లో ఉన్న ఓ గ్రామాన్ని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా దత్తత తీసుకున్నాడు. అయితే ఇది రియల్‌గా మాత్రం కాదండోయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా చేసిన స్కిట్‌లో. బుల్లెట్‌ భాస్కర్‌, గెటప్‌ శ్రీను, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్‌, రోహిణీ ఇలా అంతా ఒకే గ్రామంలో నివసిస్తుంటారు. అయితే కరువు ఏర్పడి చేసేదేమి లేక వారంతా ఆ ఊరిని వదిలేసి వెళ్లిపోవాలనుకుంటారు.

అప్పుడే వెనకనుంచి సైకిల్‌పై మహేశ్‌బాబు లెవల్‌లో వచ్చిన పృథ్వీ మీ ఊరిని నేను దత్తత తీసుకుంటున్నా.. మీరెవరూ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదని వారికి మాటిస్తాడు. ఈ టైంలోనే గెటప్ శ్రీను, రోహిణి మధ్య సాగిన కామెడీ పంచ్‌లు, భాస్కర్‌, ఆదిల జోకులు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇవే కాకుండా ‘జబర్దస్త్‌’ రాము కొరియోగ్రఫీ, ముత్యాలు వస్తావా అంటూ సుధాకర్ పాడిన పాట హిలేరియస్‌గా అనిపించాయి. అయితే ఈ ఫుల్ జోష్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుండా చూడాలంటే జూలై 11న ఈటీవీలో మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీని” చూడాల్సిందే. ఇక అంతవరకు ఈ ప్రోమో వైపు ఓ లుక్కేసుకోండి.

సంబంధిత సమాచారం :