‘శ్రీదేవి సోడా సెంటర్’కు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్..!

Published on Aug 14, 2021 10:18 pm IST

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. 70మ్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే తాజాగా ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చినట్టు తెలిసింది. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ దేశ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 12 కోట్లకు దక్కించుకున్నారు. మొన్నీ మధ్య విడుదల బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను కూడా లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :