విజయ్ దేవరకొండతో జాన్వి కపూర్ ?

Published on Dec 15, 2019 10:33 pm IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న ఫైటర్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా చెయ్యటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడట, కరుణ్ జోహారే జాన్విని ఒప్పించాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఫైటర్ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం 2020 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More