టాలెంటెడ్ డైరెక్టర్ తో నాని ఖరారు అయినట్లే ?

Published on Oct 6, 2018 1:10 pm IST

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మరియు ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధం అయ్యారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. కుటుంబ కథా చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్న శ్రీకాంత్, బ్ర‌హ్మోత్స‌వం చిత్రం ప‌రాజ‌యం తరువాత.. మరో సినిమా మొదలుపెట్టడానికి దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ సారి శ్రీకాంత్ అడ్డాల రాసిన స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని, ఖచ్చితంగా ఈ సారి హిట్ కొట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని హీరో నానితో ప్లాన్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎప్పుడో మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :