దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలగారి సినిమాలంటే కుటుంబ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకు కారణం ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఎక్కువ విలువిస్తూ సినిమాలు చేస్తుంటారాయన. చివరగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన తన తర్వాతి సినిమాలో కూడ ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఎక్కువ స్కోప్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారట.
మల్టీ స్టారర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఒకరు శర్వానంద్ కాగా ఇంకోక హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కూడ అన్నదమ్ముల బాండింగ్ హైలెట్ అవుతుందని తెలుస్తోంది . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ చిత్రం ఎపుడు మొదలవుతుంది, హీరోయిన్లు ఎవరు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.


