నితిన్ , రాశి ఖన్నా జంటగా శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలోతెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం. మంచి అంచనాల మధ్య నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం కృష్ణా జిల్లాలో మొదటి రోజు రూ. 16,07,683 లక్షల షేర్ ను రాబట్టింది.
కుటుంభ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ కథానాయికనందిత శ్వేతా ముఖ్య పాత్రలో నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈచిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.


