శ్రీ విష్ణు పాత్ర గురించే మాట్లాడుకుంటారు !
Published on Oct 25, 2017 12:20 pm IST

రామ్‌ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠిలు ఇందులో కథానాయికలుగా నటించారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమా మంచి సక్సెస్ అందుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రేమ, స్నేహనికి పెద్దపీట వేస్తూ దర్శకుడు రాసుకున్న కథ, మాటలు ప్రేక్షకులను అలరిస్తాయని, ఎక్కడా బోర్ కొట్టకుండా మనం చూస్తున్న ఈ సమాజానికి అతి దగ్గరగా ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు ఉండబోతున్నాయని అంటున్నారు. సినిమాలో ఎక్కడా అశ్లీలత లేనందువల్ల సెన్సార్ క్లీన్ యు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, కావున కుటుంబసమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో దర్శకుడు కిశోర్ తిరుమల శ్రీ విష్ణు పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుందని టాక్, సినిమా విడుదల తరువాత అందరు శ్రీ విష్ణు పాత్ర గురించే మాట్లాడుకోవడం గ్యారెంటి అని సమాచారం.

 
Like us on Facebook