మరో సారి తల్లిగా ఒకప్పటి టాప్ హీరోయిన్.

Published on Jun 8, 2019 2:10 pm IST

టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరో లతో ఆడిపాడింది శ్రీయా చరణ్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరనేలిన శ్రీయా కొత్తవాళ్ళ రాకతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఐతే సీనియర్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ అడపాదడపా సినిమాలలో కనిపిస్తుంది ఈ ఢిల్లీ బ్యూటీ. రీసెంట్ గా ఆమె ‘వీరభోగ వసంతరాయలు, బాలయ్య ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ మూవీలలో నటించినా అవి ఆమె కెరీర్ కు ఏవిధంగా ఉపయోగపడలేదు.
తాజాగా శ్రీయా ఓ క్రేజి మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది అని సమాచారం. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీయబోయే సినిమాలో శ్రీయా ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. మరో విశేషం ఏమిటంటే శ్రీయా ఈ చిత్రంలో తల్లి పాత్రలో కనిపిస్తారట. గతంలో శ్రీయా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, ‘గోపాలా గోపాలా’ చిత్రాలలో తల్లి పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, త్వరలోనే సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

More