“ఓజీ” షూట్ కొసం హైదరాబాద్ కి శ్రియా రెడ్డి!

og 2
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ పై మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఓజీ షూటింగ్ కోసం నటి శ్రియా రెడ్డి హైదరాబాద్ కి వస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది.

ఫ్యాబ్యులస్ టీమ్ తో మళ్ళీ కలిసి పని చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం డివివి ఎంటర్ టైన్మెంట్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

https://twitter.com/sriyareddy/status/1680880443858763776?t=37_ojyZ06FY4znmWRNBZNA&s=19

Exit mobile version