నేడు బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేయనున్న పఠాన్!

Published on Mar 3, 2023 8:00 pm IST


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ హీరో ఈ పఠాన్ చిత్రంతో ఇప్పటికే అనేక రికార్డ్ లని క్రియేట్ చేసారు. నేడు మరొక రికార్డ్ షారుఖ్ జాబితా లో చేరనుంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకూ హయ్యెస్ట్ గ్రాసర్ గా ఉన్న బాహుబలి2 రికార్డ్ ను నేడు పఠాన్ బ్రేక్ చేయనుంది. బాహుబలి2 చిత్రం 511 కోట్ల రూపాయల వసూళ్లతో టాప్ లో ఉండగా, పఠాన్ నిన్న మరో 75 లక్షల రూపాయల వసూళ్లతో 510.6 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

పఠాన్ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో 18 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ గా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరికొద్ది రోజులు థియేటర్ల లో సందడి చేయనుంది.

సంబంధిత సమాచారం :