క‌మెడియ‌న్‌కి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన రాజమౌళి

Published on Nov 22, 2019 8:42 pm IST

కమెడియన్ నుండి హీరోగా మారి పలు సినిమాలు చేసిన శ్రీనివాస రెడ్డి దర్శక నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుని రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. నిన్ననే వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది. తాజాగా ట్రైలర్ వీక్షించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎఎస్.రాజమౌళి శ్రీనివాస్ రెడ్డికి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

తన కెరీర్ మొదలైనప్పటి నుండి శ్రీనివాస రెడ్డి తనకు తెలుసన్న రాజమౌళి అతనొక మంచి హాస్యనటుడని ప్రశంసిస్తూ ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ చిత్రంతో దర్శక నిర్మాతగా మారిన ఆయనకు అభినందనలు తెలిపారు. ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదలకానుంది. ఈ చిత్రంలో సెంటిమెంట్, యాక్షన్ లాంటివి లేకుండా కేవలం కామెడీ మాత్రమే ఉంటుందట.

సంబంధిత సమాచారం :