అమీర్ ఖాన్ తో సినిమా – రాజమౌళి..!

అమీర్ ఖాన్ తో సినిమా – రాజమౌళి..!

Published on Sep 30, 2014 12:24 AM IST

aamir-khan-rajamouli
దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. దాదాపు 180 కోట్ల భారి వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రెండేళ్ళ నుండి కష్టపడుతున్నాడు. షూటింగ్ సమయంలో దొరికిన కొద్దిపాటి విరామ సమయంలో ముంబై మిర్రర్ అనే ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. భవిష్యత్ లో అమీర్ ఖాన్ సినిమాకు దర్శకత్వం చేయాలనుందని తన మనసులో కోరికను వెల్లడించారు.

నేను హిందీ సినిమాలు ఎక్కువగా చూడను. బట్, రాజ్ కుమార్ హిరాణి & అమీర్ ఖాన్ సినిమాలు చూడడం మాత్రం మిస్ చేయను. భవిష్యత్ లోఅమీర్ ఖాన్ తో ఒక సినిమాకు కలసి పని చేయాలని నా కోరిక. అతను నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను.. అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. అవి ఘనవిజయం సాధించాయి. ‘ఈగ’ డబ్బింగ్ వెర్షన్ ‘మక్కి’ కూడా మంచి విజయం సాధించి రాజమౌళికి పెద్ద పేరు తీసుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు