మహేష్ 28 : ఆ వార్తలు పూర్తిగా ఫేక్ అట ?

Published on Feb 28, 2023 4:33 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మహేష్ 28వ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, హైపర్ ఆది వంటి వారు కీలక పాత్రలు చేస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ లోని ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్ ని తీసుకుంటున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ విషయమై మహేష్ 28 టీమ్ నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి పక్కాగా ఆగష్టు 11న విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :