SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు రోల్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్

SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు రోల్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్

Published on Aug 3, 2023 3:00 AM IST

Rajamouli Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. దీని అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక SSMB 29 మూవీ చేయనున్నారు మహేష్ బాబు.

గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ పాన్ వరల్డ్ ప్రాజక్ట్ పై పలు వార్తలు ప్రచారంలో ఉండగా లేటెస్ట్ క్రేజీ బజ్ ప్రకారం ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు రోల్ విషయమై దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుని కెరీర్ పరంగా ఇంతకముందెన్నడూ చూడని విధంగా ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేయిస్తున్నారట జక్కన్న.

ప్రస్తుతం వి విజయేంద్రప్రసాద్ ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది చివర్లో ఈ మూవీ యొక్క వర్క్ షాప్ జరగనుండగా డిసెంబర్ నుండి దాదాపుగా నాలుగు నెలలపాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ పరంగా నిపుణుల అద్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారట. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాలు అయితే మేకర్స్ నుండి అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

తాజా వార్తలు