దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది, ప్రియాంక చోప్రా కూడా ఇందులో నటిస్తోంది. ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఐతే, ఈ సినిమా చిత్రీకరణ నుండి విరామం తీసుకున్న ఆమె, తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం ముంబైకి వెళ్తూ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించింది.
కాగా ప్రియాంక చోప్రా లేకపోయినా, సినిమా చిత్రీకరణ మాత్రం కొనసాగుతుంది. షెడ్యూల్ యథావిధిగా కొనసాగేలా రాజమౌళి, మహేష్ బాబుతో కూడిన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ప్రియాంక అతి త్వరలో తిరిగి వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతుందట. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.