కళ్యాణ్ రామ్ ‘షేర్’ ఆడియో లాంచ్‌కి అంతా రెడీ!

కళ్యాణ్ రామ్ ‘షేర్’ ఆడియో లాంచ్‌కి అంతా రెడీ!

Published on Oct 10, 2015 2:40 PM IST

sher
‘పటాస్’ సినిమాతో చాలాకాలంగా ఎదురుచూసిన సూపర్ హిట్ దక్కడంతో హీరో కళ్యాణ్ రామ్ ఆ జోష్‌తో షేర్ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ 30వ తేదీన సినిమా విడుదలవ్వనుండగా, ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను విడుదల చేయనున్నారు. పార్క్ హయత్‌లో జరగనున్న ఈ ఆడియో వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ హాజరవ్వనుండడంతో ఈ వేడుక నందమూరి అభిమానులకు స్పెషల్‌గా నిలిచింది. నందమూరి బ్రదర్స్ ఈ ఆడియో వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారనడంలో సందేహం లేదు. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను షేర్ సినిమాను కొమర వెంకటేష్ నిర్మించారు. ఇక తన గత చిత్ర పటాస్‌లో ఓ స్ట్రాంగ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రాం, ఈ సినిమాలోనూ అదేస్థాయి పవర్ఫుల్ పాత్రతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు