కొత్త సంవత్సరంలో శుభవార్త చెప్పిన స్నేహ

కొత్త సంవత్సరంలో శుభవార్త చెప్పిన స్నేహ

Published on Apr 14, 2015 11:21 AM IST

Sneha-and-Prasanna
‘ప్రియమైన నీకు’, ‘శ్రీ రామదాసు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘రాజన్న’ మొదలైన తెలుగు సినిమాలలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ స్నేహ. ప్రతి సినిమలో మన ఇంట్లో అమ్మాయిలా కనిపించి సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్నేహ త్వరలో తల్లి కాబోతోంది. స్నేహ తమిళ యాక్టర్ అయిన ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2012లో జరిగింది.

ఈ రోజు తమిళ కొత్త సంవత్సరం.. ఈ పండుగ దినాన ప్రసన్న – స్నేహ దంపతులు ఓ శుభవార్తని అందరితో పంచుకున్నారు. ‘ఈ స్పెషల్ రోజున మీ అందరితో ఓ శుభవార్త పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఇంట్లోకి మరో కొత్త మెంబర్ వస్తాడు. దానికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అని’ ప్రసన్న ట్వీట్ చేసాడు. దీని ప్రకారం స్నేహ మరి కొద్ది రోజుల్లో ఓ బిడ్డకి జన్మనివ్వనుందని తెలుస్తోంది. స్నేహ రీసెంట్ గా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమాలో కనిపించి అలరించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు