రామ్ చరణ్ సినిమా కోసం ‘రోబో’ టెక్నీషియన్ !

27th, October 2016 - 11:00:08 AM

Ratnavelu
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సౌత్ సినీ ఇండస్ట్రీలోని టాప్ సినిమాటోగ్రఫర్ రత్నవేలు పనిచేయనున్నాడట. ఈయన గతంలో శంకర్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేశారు. ఆ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. ఆ విజయంలో రత్నవేలు సిమాటోగ్రఫీ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత ఈయన రజనీ ‘లింగ’ చిత్రానికి కూడా పనిచేశారు.

ప్రస్తుతం ఈ స్టార్ సినిమాటోగ్రఫర్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ కి కూడా పనిచేస్తున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్ కు, రత్నవేలు కు మంచి అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరూ ‘ఆర్య, జగడం,1 నేనొక్కడినే’ వంటి సినిమాలకి కలిసి పనిచేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే పిరియాడికల్ ప్రేమ కథగా ఉండబోతున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ డిసెంబర్ నుండి మొదలయ్యే అవకాశముంది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘ధృవ’ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.