బిగ్‌బాస్ 5 తెలుగులోకి స్టార్ కమెడీయన్?

Published on Jul 7, 2021 12:01 am IST


తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్‌పుల్‌గా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టబోతుంది. కరోనా కారణంగా ఆలస్యమవుతున్న ఈ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్న సమయంలో షో గురుంచి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తొలుత జూలై నుంచి షో ప్రారంభమవుతుందని ప్రచారం జరిగినా ఆగస్ట్ చివరలో షోను స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదేకాకుండా ఈ షోకు ఈ సారి హోస్ట్‌గా దగ్గుబాటి రానా రాబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది. వీటన్నిటిని పక్కనపెడితే ఈ సారి హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎవరెవరు వెళ్లబోతున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి స్టార్ క్యాస్టింగ్‌ను హౌస్‌లోకి పంపాలని భావిస్తున్న నిర్వాహకులు సీనియర్ కమెడీయన్ అలీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. స్టార్ కమెడీయన్ ఆలీ లాంటి వ్యక్తి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళితే టీఆర్పీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట. ఇందుకోసం ఆలీకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు వెనుకాడడం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలీదు కానీ అలీ లాంటి లెజెండరీ కనుక షోలో అడుగెడితే నిజంగా షోకు భారీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది ఖచ్చితంగా చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం :