స్టార్ హీరో కూతురి సినీరంగ ప్రవేశం ఖరారైంది !
Published on Feb 18, 2017 1:23 pm IST


బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.కానీ దీనిని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.తాజాగా ఈ విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ దృవీకరించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. సారా అలీ సినీరంగ ప్రవేశం త్వరలోనే ఉంటుందని ప్రకటించాడు. కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న ఓ చిత్రంలో తన కుమార్తె నటించనుందని తెలిపాడు.

తన కుమార్తెని సినిమాల్లో పరిచయం చేయడానికి కరణ్ జోహార్ సరైన వ్యకి అని సైఫ్ తెలపడం విశేషం. కాగా అలనాటి నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి నికూడా కరణ్ జోహార్ తన చిత్రం లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook